![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -221లో.. కృష్ణ, మురారి ఇద్దరూ దూరం, దూరంగా కూర్చొని తమ మనసులోని ప్రేమని ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని హగ్ చేసుకున్నట్లు ఊహించుకుంటారు. ఆ తర్వాత కృష్ణ, మురారి బాధపడుతుంటారు.
మరొక వైపు కృష్ణ, మురారి మధ్య అసలేం జరుగుతోందని భవాని ఆలోచిస్తుంటుంది. అయితే అక్కడే హాల్లో కూర్చొని ఉన్న ముకుందని.. "కృష్ణ నీకేమైనా చెప్పిందా?" అని భవాని అడుగుతుంది. 'ఇదే కరెక్ట్ టైమ్.. కృష్ణ, మురారీలది అగ్రిమెంట్ మ్యారేజ్ అని ఎలాగైనా పెద్ద అత్తయ్యకి చెప్పాల'ని ముకుంద అనుకొని చెప్తుండగా అప్పుడే రేవతి వచ్చి ముకుంద చెప్పకుండా ఆపుతుంది. అక్క కృష్ణ మురారీల మధ్య ఏదో సమస్య ఉందని అంటుంది. ఏంటని భవాని అడుగగా.. అది నాకు తెలియడం లేదని రేవతి అనగానే.. వాళ్ళ ఇద్దరి మధ్య ఏం సమస్య ఉందో తెలియకపోతే వ్రతం, హోమం ఎందుకు చేయించావని రేవతిని భవాని అడుగుతుంది.
చేయించాను కానీ నాకు వాళ్ళిద్దరి సమస్య ఏంటో తెలియడం లేదు.. మీరే వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని సాల్వ్ చెయ్యండని భవానితో రేవతి చెప్తుంది. ముకుంద ఏదో చెప్పబోతుంటే.. నువ్వు ఆగు ముకుందా, వాళ్ళ మధ్య ఏం జరుగుతుందనేది నేనే తెలుసుకుంటానని భవాని అంటుంది. మరొక వైపు ముకుంద తన గదిలో ఉండగా రేవతి వెళ్తుంది. "మీరు వస్తారని నాకు తెలుసు అత్తయ్యా" అని ముకుంద అనగానే.. "నీతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి వచ్చాను. ఈ పగ ప్రతీకారం వద్దు.. నీ ప్రేమ గొప్పదే కాదనను, కానీ పెళ్లికి కట్టుబాట్లు ఉంటాయ"ని రేవతి అనగానే.. "మీకు వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. కృష్ణ సన్మానానికి మురారి ఉండేవాడు. కృష్ణ బాధపడేది కాదు. కృష్ణ, మురారి తన భర్త అని ఫీల్ అయితే కృష్ణ ఒకతే స్టేజి పైకి వెళ్ళేది కాదు. ఋణం, బాధ్యత అనే పదాలు రావు కానీ మురారిపై కృష్ణ అలానే ఫీల్ అవుతోంది" అంటుంది ముకుంద.
ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. అందరూ సైలెంట్ గా ఉంటారు. నేను ఇలా డల్ గా ఉంటే అందరికి డౌట్ వస్తుందని కృష్ణ అనుకొని సరదాగా ఉన్నట్లు నటిస్తుంది. ఆ కర్రీ బాగుంది, ఈ కర్రీ బాగుందంటూ కావాలనే మాట్లాడుతుంది. ఏంటి కృష్ణ తన బాధను పోగొట్టుకోవడానికి ఇలా చేస్తుందని భవాని తన అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |